Sunday, 26 April 2026 04:03:27 PM

నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి

Date : 20 May 2023 08:11 PM Views : 164

One Tv News - NEWS / జయశంకర్ భూపాలపల్లి జిల్లా : జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుండి ఛత్తీస్గడ్ రాష్ట్రం బీజాపూర్ కి నూతన సూపర్ లగ్జరీ బస్సు సర్వీసును భూపాలపల్లి శాసనసభ్యుడు గండ్ర వెంకట రమణారెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్రమాట్లాడుతూదినదిన అభివృద్ధి చెందుతున్న భూపాలపల్లిలో అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాభాల బాటలో నడుస్తున్న ఆర్టీసీ డిపోలలో భూపాలపల్లి ఉండడం చాలా హర్షనీయమని డిపో మేనేజర్ మరియు కార్మికులను ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఎమ్మెల్యే అభినందించారు.

ఈ బస్ సర్వీసును స్థానికంగా ఉండే ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి జిల్లా నుండి పొరుగు రాష్ట్రాలకు సర్వీసులు ప్రారంభించుకోవడం చాలా శుభ పరిణామం అని తెలిపారు. మరిన్ని సూపర్ లగ్జరీ బస్సులు త్వరలో అందుబాటులో రానున్నాయని గుర్తు చేశారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చాలా సురక్షితమని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు అధికారులు పాల్గొన్నారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :