One Tv News - NEWS / అనకాపల్లి జిల్లా : రాష్ట్రంలోని సర్పంచులు, ఎమ్పీటీసీలు దయనీయ స్థితిలో వున్నారని ఆంధ్రప్రదేశ్ పంచాయతిరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వై వి బి రాజేంద్రప్రసాద్ అన్నారు. శనివారం అనకాపల్లి పట్టణం లోని స్థానిక వైఎంవిఏ హాల్లో నిర్వహించిన ఉమ్మడి విశాఖ జిల్లా సర్పంచుల సదస్సుకు రాజేంద్రప్రసాద్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీ ముత్యాల రావు ముఖ్య అతిథులుగా విచ్చేసారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ 2022 - 23 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థికసంఘం నేరుగా గ్రామ పంచాయతీలకు మంజూరు చేసిన రూ. 2020 కోట్ల నిధులు ఏమయ్యాయని సిఎం జగన్మోహన్ రెడ్డి ని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిన సర్పంచుల నిధులు రూ. 8వేల 660 కోట్లు వెంటనే తిరిగి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా సర్పంచుల ఆధీనంలోకి గ్రామ సచివాలయాలు, వాలంటీర్లను తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు.
One Tv News