One Tv News - NEWS / కర్నూలు జిల్లా : మలబార్ అంటేనే మన్నికకు మారుపేరని సోలార్ కింగ్ ఎస్ఎంబీ ఫౌండేషన్ అధినేత షేక్ మహబూబ్ బాషా అన్నారు. కర్నూల్ నగరంలోని మలబార్ షోరూంలో గోల్డ్ అండ్ డైమండ్ షో ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై కొత్త బంగారు వజ్ర ఆభరణాల నూతన మోడల్స్ ను ఆవిష్కరించారు. కర్నూల్ నగరంలో 2012లో ప్రారంభమైన మలబార్ షోరూం అంచలంచలుగా ఎదుగుతూ ఎన్నో రకాల బంగారు వజ్రాభరణాలను తయారు చేస్తూ మహిళల మనసులను చూరగొన్న ఏకైక షోరూం మలబార్ షోరూం అన్నారు. అటువంటి షో రూమ్ లో బంగారు,వజ్రాభరణాల ఆవిష్కరణకు తనను ఆహ్వానించినందుకు మలబార్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. మలబార్ షో రూమ్ లో బంగారు వజ్రభరణాలే కాకుండా వెండి ఆభరణాలను సైతం బంగారు వజ్రాల నగలకు ఏమాత్రం తీసిపోకుండా తయారుచేసి అందించడం మలబార్ ప్రత్యేకత అన్నారు. మలబార్ వారు అందిస్తున్న ఈ సదావకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మలబార్ షోరూమ్ లో పనిచేస్తున్న సిబ్బంది వచ్చిన కస్టమర్లను సాదరంగా ఆహ్వానించి మర్యాదపూర్వకంగా నడుచుకుంటారని తాను చాలా సంవత్సరాలుగా ఈ షో రూమ్ కి వస్తున్నానని సిబ్బందిని అభినందించారు.
ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో డాక్టర్ శైలజ మహతి లు ఆవిష్కరణలో పాల్గొనగా అసిస్టెంట్ స్టోర్ హెడ్ సమీర్ షోరూమ్ మేనేజర్ అజిత్ కుమార్ మార్కెటింగ్ మేనేజర్ నూరుల్లా సుధాకర్ మన్సూర్ లు పాల్గొన్నారు.
One Tv News