Sunday, 26 April 2026 02:41:50 PM

కాంగ్రెస్ పార్టీ నాయకుల సంబరాలు

మెదక్ జిల్లా

Date : 14 May 2023 10:06 AM Views : 344

One Tv News - NEWS / మెదక్ జిల్లా : మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి 136 స్థానాలు గెలుచుకోవడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షులు నిమ్మ రమేష్ ఆధ్వర్యంలో ప్రధాన చౌరస్తా వద్ద తపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఈసందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ దేశంలో కులం మతం జాతి కులాల మతాల సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజల సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరిగాయి అని అన్నారు బిజెపి పార్టీ నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యంలో సాధించిన విజయం తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో యాత్రతో దేశం మొత్తం కాంగ్రెస్ వైపు చూస్తుందని కాంగ్రెస్ పాలనలోనే పేదల సంక్షేమం జరిగిందని ఈ సందర్భంగా వారు తెలిపారు

రాబోవు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు ఈకార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :