Sunday, 26 April 2026 02:42:15 PM

మణిపూర్ లో సామూహిక అత్యాచారాలు మారణకాండ కు పాల్పడుతున్న పైశాచిక దుర్మార్గులను కఠినంగా శిక్షించాల

బద్వేల్

Date : 24 July 2023 09:27 AM Views : 307

One Tv News - NEWS / కడప జిల్లా : మణిపూర్ లో సామూహిక అత్యాచారాలు మారణకాండ కు పాల్పడుతున్న పైశాచిక దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్ సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ సంఘాల ఆధ్వర్యంలో కడప జిల్లా బద్వేల్ నాలుగు రోడ్ల సెంటర్ నుండి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సర్కిల్ వరకు మణిపూర్ రాష్ట్రంలో సామూహిక అత్యాచారాలు మారణకాండ కు పాల్పడుతున్న పైశాచిక దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్భంగా ఐద్వా మహిళా సంఘం పట్టణ అధ్యక్ష- కార్యదర్శులు గంప అనంతమ్మ, రత్తమ్మ, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మీడియం చిన్ని, సిఐటియు జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాసులు సంయుక్తంగా మాట్లాడుతూ... దేశంలో రోజు రోజు కి మహిళలకు రక్షణ కరువైందని,నిత్యం ఎక్కడో ఒక చోట మహిళల పై దాడులు,అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయని, నెల రోజులుగా మణిపూర్ లో అల్లర్లు,ఇతర ఘటనలు విపరీతంగా జరగడం దారుణం అన్నారు. అల్లర్లలో చాలా మంది చనిపోయారని, ఇద్దరు మహిళల ను నగ్నంగా ఊరేగించి అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన ఘోరమైనది అన్నారు. రోమ్ నగరం తగలబడుతుంటే నిరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లు మణిపూర్ తగలబడి పోతుంటే దేశ ప్రధాని మోడీ మౌన నిద్ర లో వుండటం దారుణం అన్నారు..కేంద్ర మంత్రులు కనీసం స్పందించని దుస్థితి అన్నారు.ఎక్కడో కేరళలో ఏనుగు సంఘటన పై గగ్గోలు పెట్టిన బిజెపి సమాజం లో ప్రతి ఒక్కరూ సిగ్గుపడే సంఘటన మణిపూర్ మహిళల పట్ల జరిగిన ఎవ్వరూ స్పందించలేదన్నారు .మహిళల పట్ల దుష్యర్యకు పాల్పడిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని ఇటువంటి సంఘటనలు మళ్ళీ ఎక్కడా జరుగకుండా తక్షణమే భద్రతా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహించవలసి వస్తుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఐద్వా మహిళ సంఘము పట్టణ నాయకురాళ్లు మస్తాన్ బీ,బాలమ్మ,గౌతమి,రామ లక్షుమ్మ, డివైఎఫ్ఐ పట్టణ నాయకులు నాగార్జున,సురేంద్ర,సురేష్, మహిళ కన్వీనర్స్ గురుదేవి,నాగ లక్ష్మి, సిఐటియు నాయకులు పి.సి కొండయ్య, జి .రాజగోపాల్, కెవిపిఎస్ నాయకులు ఎం. నరసింహులు తదితరులు పాల్గొన్నారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: