Sunday, 26 April 2026 04:04:11 PM

శంషాబాద్ లో యువకుని పై దాడి చేసిన ఓ పోలీస్ కానిస్టేబుల్

శంషాబాద్

Date : 02 June 2023 08:52 AM Views : 184

One Tv News - NEWS / హైదరాబాద్ : శంషాబాద్ లో యువకుని పై ఓ పోలీస్ కానిస్టేబుల్ దాడి చేసి గాయపరిచిన సంఘటన చోటుచేసుకుంది తీవ్రంగా గాయపడ్డ యువకుడు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. అడ్డువచ్చిన యువకుడి బాబాయ్ పైకి కానిస్టేబుల్ కారుతో దూసుకుపోయాడు అతనికి తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచింతల్ గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుడు పవన్ కళ్యాణ్ తెలిపిన వివరాల ప్రకారం. ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్న జ్ఞానేశ్వర్ పవన్ కళ్యాణ్ అనే యువకుడు నడుచుకుంటూ వెళుతున్నాడు. అయితే పదేపదే తన ఇంటి ముందు నుండి ఎందుకు వెళుతున్నావు అని యువకుడ్ని జ్ఞానేశ్వర్ ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడి పవన్ కళ్యాణ్ పై దాడి చేశాడు . అయితే దాడిలో గాయపడ్డ పవన్ కళ్యాణ్ తన బాబాయిని తీసుకుని వస్తుండగా కానిస్టేబుల్ జ్ఞానేశ్వర్ కారు ఆపకుండా పవన్ కళ్యాణ్ బాబాయ్ పైకి దూసుకొచ్చాడు. దీంతో పవన్ కళ్యాణ్ బాబాయ్ కారు పైకి ఎగిరిపడ్డాడు దాదాపు 100 మీటర్ల వరకు అతన్ని కారుతో లాక్కెళ్ళినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు‌ బాధితుడు పవన్ కళ్యాణ్ శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అయితే పోలీసులు ఏమాత్రం స్పందించడం లేదని కనీసం నిందితులపై ఇప్పటివరకు ఎలాంటి చర్య తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నాడు


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: