Sunday, 26 April 2026 04:04:34 PM

కంటోన్మెంట్ ఎనిమిదో వార్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం

సికింద్రాబాద్

Date : 27 June 2023 09:54 AM Views : 189

One Tv News - NEWS / హైదరాబాద్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించేందుకు తన వంతు కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టిన మల్లారెడ్డి అన్నారుకంటోన్మెంట్ ఎనిమిదో వార్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ నూతనంగా తనకు పార్టీ బాధ్యతలు ఇచ్చిందని ఎనిమిది వార్డులతోపాటు మొండా డివిజన్ మున్సిపాలిటీ విజయంలో కూడా పార్టీని పటిష్టపరిచేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు ముఖ్యంగా పార్టీ అధిష్టాన వర్గం గతంలో తనకు తాను చేసిన సేవలు పార్టీ గుర్తించి కంటోన్మెంట్ బాధ్యతలు అప్పగించిందని ఆయన అన్నారులీడర్ మిషన్ డెవలప్మెంట్ ద్వారా కంటోన్మెంట్లో అన్ని వార్డుల్లో , బస్తీల్లో , తిరిగి కార్యకర్తలు పార్టీలో చేరేలా గతంలో పనిచేసి వెళ్లిపోయిన వారిని తిరిగి తీసుకునేలా శ్రద్ధ చూపి పార్టీని పటిష్ట పరుస్తామని ఆయన అన్నారు అందుకు కార్యకర్తలు నాయకులు తనకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ నియోజకవర్గ సీనియర్ నాయకుడు డిబి దేవేందర్ మాట్లాడుతూ పార్టీ అన్ని డివిజన్లో పటిష్టంగా ఉందని ఈసారి జరగబోయే ఎన్నికల్లో పార్టీ విజయం తద్యమన్నారు .

గతంలో నాన్ లోకల్ కార్యకర్తలకు నాయకులకు కాంగ్రెస్ టికెట్లు ఇచ్చారని వారు టికెట్లు పొందాక గెలి పార్టీని వదిలేసి వెళ్లిపోయారని కేవలం కార్యకర్తలే మిగిలేరని ఆయన అన్నారు ఇకముందు స్థానికులకే టికెట్లు ఇవ్వాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు నరసింహ, అరవింద్, నంది కంటి రవి, జమీల్, గజ్వేల్ భరత్, తదితరులు హాజరయ్యారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: