One Tv News - NEWS / నంద్యాల జిల్లా : శ్రీశైల మహాక్షేత్రంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఆంజనేయస్వామికి విశేషపూజలు నిర్వహించారు పాతాళగంగమార్గంలో ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో లోక కల్యాణం కోసం విశేషపూజలలో భాగంగా దేశం శాంతి సౌభాగ్యాలలో విలసిల్లి, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో వర్షాలు కురిసి దేశంలోని జనులందరికి ఆయురారోగ్యాలతో ఉండాలని అర్చకులు సంకల్పాన్ని చెప్పి కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతిపూజ అనంతరం శ్రీ ఆంజనేయస్వామివారికి శ్రీమన్యుసూక్త పారాయణ సహిత అభిషేకము పంచామృతాభిషేకం, జలాభిషేకం స్వామిని ప్రత్యేకంగా అలంకరించి అష్టోత్తర పూజ, నాగవల్లిదళపూజ (ఆకుపూజ), వడమాల సమర్పణ, పుష్పార్చన నిర్వహించారు
ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో లవన్న, ఆలయ అధికారులు,అర్చకస్వాములు, సిబ్బంది భక్తులు పాల్గొన్నారు
One Tv News