One Tv News - NEWS / నెల్లూరు జిల్లా : నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఆత్మకూరు రూరల్ మండలం వైసీపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల సచివాలయాల కన్వీనర్ వల్లభనేని రాజేంద్ర. ఎంపీపీ కేతా. వేణుగోపాల్ రెడ్డిలు మాట్లాడుతూ... ఇటీవల ఆనం రామ నారాయణరెడ్డి ఆత్మకూరు అభివృద్ధి జరగలేదని ప్రస్థాపన తెచ్చారని ఆత్మకూరు అభివృద్ధి పథంలో ముందుకెళ్లడం చూసి ఓర్వలేక, మరల మేకపాటి విక్రమ్ రెడ్డికి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు పట్టం కట్టాలని కృత నిశ్చయంతో ఉండటంతో అది గ్రహించిన సీనియర్ నాయకుడు ఆనం రామ నారాయణరెడ్డి మేకపాటి విక్రమ్ రెడ్డి పై, బురదజల్లడం వంటి ప్రయత్నం చేశారని అన్నారు. రాజకీయ చైతన్యం కలిగిన ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు అది గ్రహించారని ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు మరల విక్రమ్ రెడ్డిని శాసనసభ్యుగా ఎన్నుకోవటం తద్యమని తెలియజేశారు.
ఆత్మకూరు నియోజకవర్గం సమస్యలపై అవగాహన ఉండి పరిష్కరించే శక్తి సామర్ధ్యాలు కలిగిన వ్యక్తి విక్రమ్ రెడ్డి అని తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో విక్రమ్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆత్మకూరు సమగ్ర అభివృద్ధిలో మనం పాలు పంచుకోవాలని కోరారు.
One Tv News