One Tv News - NEWS / తూర్పు గోదావరి జిల్లా : తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ కడియం మండలం దుళ్లలో అపర భగీరధుడు సర్ ఆర్ధర్ కాటన్ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. కాటన్ దొర భక్తుడు, ప్రముఖ రైతు సత్తి భాస్కర్ రెడ్డి (కందరెడ్డి) ప్రతి ఏటా కాటన్ జయంతి వేడుకలను ఒక ఉత్సవంలా జరుపుతారు. ఈ ఏడాది కూడా కందరెడ్డి గ్రామంలోని వేదపండితులను పిలిచి పూజలు జరిపించారు. తన ఇంటి ముందు నెలకొల్పిన నిలువెత్తు విగ్రహానికి ధాన్యం, క్షీరం, నదీజలాలతో అభిషేకించారు. అలానే పట్టు వస్త్రాలను సమర్పిoచారు. గ్రామంలో రైతులను ఆహ్వానించి తేనీటి విందు ఇచ్చారు. వేద పండితుల సాక్షిగా మంత్రోచ్ఛరణలు మధ్య ఆ మహనీయుని జయంతి వైభవంగా నిర్వహించారు.
ధవలేశ్వరం వద్దకు కాటన్ బ్యారేజ్ నిర్మించక ముందు వరద మంపులతో గోదావరి రైతులు అల్లాడి పోయేవారన్నారు. తమ పూర్వికులు రైతుక్షేత్రాల్లో కరువు కాటకాలు అనుభవించేవారన్నారు. బ్రిటిష్ ఇంజనీర్ గా మన దేశానికి వచ్చిన కాటన్ దొర కాటన్ బ్యారేజ్ నిర్మించడం ద్వారా రైతులపాలిట ఆపద్భాందవునిగా మారారన్నారు.
One Tv News