One Tv News - NEWS / కడప జిల్లా : కడప జిల్లా బద్వేల్ ఆరోగ్యభారత్ ఫౌండేషన్ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు. బద్వేల్ కు చెందిన ఆరోగ్య భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం బ్రహ్మంగారిమఠం మండలం రాజు పేట గ్రామంలో ఉండే పేద కుటుంబం పీరుసాహెబ్ కుటుంబానికి బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు ఉచితంగా అందజేశారు. ఈ సందర్బంగా ఆరోగ్యభారత్ ఫౌండేషన్ అధ్యక్షులు రహీమ్ మాట్లాడుతూ.... రాజుపేట గ్రామంలో పీరు సాహెబ్ అనే వ్యక్తికి పెరలాసిస్ వచ్చి, ఆరోగ్యం సరిగా లేక మంచానికే పరిమితమై, పూటగడవడానికి ఇబ్బంది పడుతున్న కుటుంబాన్ని మా సంస్థ సభ్యులు గుర్తించడం జరిగిందని అన్నారు.
ఆ కుటుంబానికి మా సంస్థ తరపున ఈ రోజు బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశామన్నారు. ప్రతి ఒక్కరూ సేవా గుణం కలిగి ఉండి పేదలకు వృద్ధులకు అనాధలకు తగినంత సహాయం చేయాలన్నారు.
One Tv News