Sunday, 26 April 2026 02:41:39 PM

మంత్రాలయం సమీపంలో రూ 250 కోట్లతో దేశంలో అతిపెద్ద 108 అడుగుల శ్రీరాముడు కాంస్య విగ్రహా ఏర్పాటు

మంత్రాలయం

Date : 24 July 2023 09:23 AM Views : 321

One Tv News - NEWS / కర్నూలు జిల్లా : కర్నూలు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం సమీపంలో రూ 250 కోట్లతో దేశంలో అతిపెద్ద 108 అడుగుల శ్రీరాముడు కాంస్య విగ్రహా ఏర్పాటుకు జై శ్రీరామ్ ఫౌండేషన్ వారు శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు ఆశీస్సులతో శ్రీకారం చుట్టారు... 108 అడుగుల శ్రీరాముడి విగ్రహానికి ఢిల్లీ నుంచి వర్చువల్ గా ఆదివారం కేంద్ర మంత్రి అమిత్ షా శంకుస్థాపన చేశారు. ముందుగా అమిత్ షా మాట్లాడుతూ పవిత్ర పుణ్య క్షేత్రం మంత్రాలయంలో 108 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు... శ్రీ మఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం, విద్య, వైద్య తదితర సేవలు అందిస్తున్న శ్రీ మఠానికి, పీఠాధిపతి శ్రీ సుభుధేంద్ర తీర్థ స్వామిని అభినందించారు... శ్రీరాముడి విగ్రహం ఏర్పాటు చేస్తున్న జై శ్రీరామ్ ఫౌండేషన్ వారికి దేశ ప్రదాని నరేంద్ర మోది, తాను ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్న అందిస్తామని అమిత్ షా అన్నారు... ఇప్పటికే 108 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఢిల్లీలో పనులు ప్రారంభం అయ్యాయని తెలిపారు...

ఈ కాంస్య విగ్రహ భూమి పూజ కార్యక్రమం తిలకించేందుకు ముఖ్య అతిథులుగా మంత్రి గుమ్మనూరు జయరాం, MLC బిటి నాయుడు, బిజెపి నాయకులు టిజి వెంకటేష్ పాల్గొన్నారు... ఈ సందర్భంగా ఆంధ్ర, కర్నాటక నుంచి భారీగా విఐపిలు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: